ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సిలో విద్యార్థులచే తల్లిదండ్రులకు పాదపూజ
హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామ శివారు లోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో చదువుతున్న విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం ఆదివారం నిర్వహించినట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ జగన్మోహన్,ప్రిన్సిపాల్ శేషగిరిరావు మీడియాకు తెలిపారు.అనంతరం పాఠశాల ఆవరణలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు (వీడ్కోలు) ఫేర్ వెల్ పార్టీ కార్యక్రమాన్ని కెనావో 2024 పేరుతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ మొటివేషినల్ స్పీకర్ అప్పాల ప్రసాద్ జీ,ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత,చైర్మన్ శ్రీపతి రెడ్డి,హసన్ పర్తి మండల విద్యాశాఖాధికారి రాం కిషన్ రాజు హాజరై విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు,పాఠశాల సిబ్బంది,తల్లిదండ్రులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.