తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం తపాలా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సూర్యాపేట డివిజన్ జిడిఎస్ PJCA కన్వీనర్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం మూడో రోజు కొనసాగించారు.. ఈ సందర్భంగా సూర్యా పేటలోని పోస్టల్ శాఖ జిల్లా కార్యాలయం ఎదుట శిబిరంలో ఆయన v3 న్యూస్ తో మాట్లాడారు. 8 గంటల పనివిధానం కల్పించడంతో పాటు పెన్షన్, 12, 24, 36 ఏళ్ల సర్వీస్లకు అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఉచిత వైద్యసౌకర్యం కల్పించాలన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.