తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దు..!
ధర్నాకు దిగిన టీ.ఎస్ డబ్ల్యూ.ఆర్ ఉపాధ్యాయ సిబ్బంది…
తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దంటూ..!నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని టీ.ఎస్.డబ్ల్యూ.ఆర్ పాఠశాల జూనియర్ కాలేజ్ ఉపాధ్యాయ సిబ్బంది మంగళవారం తమకు దొరికిన విరామ సమయంలో కాలేజ్ ముందర ధర్నాకు కూర్చున్నారు.మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు జూనియర్ కాలేజ్ రెగ్యులర్ ఉపాధ్యాయ సిబ్బంది,బోధనోపాధ్యాయ సిబ్బందికి ప్రిన్సిపాల్ అయినటువంటి ఎండి రఫిద్దున్ దురుష పదజాలంతో సంభాషించడం,ప్రతిరోజు ఉపాధ్యాయులే టార్గెట్గా వ్యవహరించడo ఇబ్బందిగా ఉందంటూ, గతంలో ఇతను పనిచేసినటువంటి సంస్థలో సైతం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని అక్కడ సస్పెన్షన్ వేట్ తో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలానే ప్రదర్శించడం జరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.ఇట్టి ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు సైతం తెలిపామని,వెంటనే ఉన్నత అధికారులు స్పందించి ఇక్కడ ప్రిన్సిపాల్ నీ తప్పించాలని కోరారు. ఇట్టి విషయంపై ప్రిన్సిపాల్ ని సంప్రదించి అడగగా…అవన్నీ తప్పని చెపుతూ పూర్తి సరైన సమాధానం తెలుపకపోగా మీడియాను దాటేసి వెళ్లిపోయిన వైనం కనపరిచారు.