తెలంగాణలోనూ ఉత్తరాది ఫలితాలు – రాజస్థాన్ సీఎం
సర్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కొనసాగుతుందన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజనలాల్ శర్మ. బుధవారం ఆయన చేవెళ్ల బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘ప్రవాసి సమ్మేళన్’ పేరిట నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో నివసించే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భజనలాల్ శర్మ మాట్లాడుతూ . నరేంద్ర మోడీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇవాళ గ్రామ గ్రామానికి చేరాయని, వాటిని ప్రత్యక్షంగా అందుకుంటున్న లక్షలాదిమంది ప్రజలు నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.