దళిత, బడుగు, బలహీన, నిరుపేద ప్రజలు విద్య, రాజకీయంగా ఎదిగినప్పుడే డాక్టర్ బాబాసాహేబ్ అంబేడ్కర్ కలలుగన్న ఆశయాలు సహకారం అవుతాయని ముస్తాబాద్ మండల అంబేడ్కర్ సంఘాల అధ్యక్షులు కాంపెల్లి శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ కేంద్రంలో అంబేడ్కర్ సంఘాల మండలాధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్ వర్థంతి వేడుకలును మండల ప్రజలు హట్టహసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహనికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ..అట్టడుగువర్గాల్లో పుట్టి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు నడువాలని అన్నారు. . అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలు సదా ఆచరణీయమన్నారు. అన్ని తరాలవారు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే బడుగు, బలహీన , మైనార్టీ ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కోన్నారు. అంబేడ్కర్ కలలుకన్న స్వారాజ్యం కాకముందే ఆయన మననుంచి దూరమవ్వడం బాదకరమన్నారు. ఈ వేడుకల్లో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, అంబేడ్కర్ సంఘాల నాయకులు కొమ్ము బాలయ్య, పెద్దిగారి శ్రీనివాస్, సుంచుయల్లయ్య, గుండెల్లి రాజలింగం, బుర్ర రాయులు గౌడ్, శ్యాడ శ్రీనివాస్,కొమ్మట రాజమల్లు, రఘుపతి, తలారి నర్సింలు, శ్రీనివాస్ గౌగ్, చింతోజు బాలయ్య, శ్యాడ శ్రీనివాస్, క్రిష్ణ, అంబేడ్కర్ యువజన విభాగం నాయకులు, గ్రామస్థులు తదితరు పాల్గొన్నారు .