Telangana

నూతన పోలీస్ భవనాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్

అంబర్ పేట లో ఈస్ట్ జోన్ డీసీపీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్,సీపీ సీవీ ఆనంద్ .
పోలీసుల శాఖ ఏ సమస్య ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నాడు. అంబర్పేటలో ఈస్ట్ జోన్ డిసిపి నూతన కార్యాలయాన్ని ప్రారంభించి మంత్రి మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండాఉండాలని, ముఖ్యంగా మహిళలకు ఎవరి నుండి ఇబ్బందులు తలెత్తకుండా వారి కి రక్షణగా నిలవాలని పోలీసులకు సూచించాడు. మహిళా దినోత్సవం ను పురస్కరించుకొని మహిళలకు ముందస్తు శుభాకాంక్షలు అంటూ . అంబర్పేట లో ఫైర్ స్టేషన్ లేని విషయం తన దృష్టికి వచ్చిందని ఫైర్ స్టేషన్ కి ఇక్కడే స్థలం ఇచ్చేలా పోలీసులు సహకరిస్తారని . ఫైర్ స్టేషన్ నిర్మాణం ఇక్కడే పూర్తి చేయాలని సంబంధిత అధికారులు ఆ దిశగా పనులను ప్రారంభించేందుకు అధికారులు చూడాలని ఆన్నాడు. అంబర్పేట ప్రజలు రిజిస్ట్రేషన్ కి దోమలగూడ పోవాలని చెప్తున్నారు స్థలం చూపిస్తే ప్రభుత్వానికి గతంలో కేటాయించి ఉపయోగించని స్థలాలను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం నియోజకవర్గానికి యంగ్ ఇండియా నాలుగు గురుకులాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది స్థలం చూపిస్తే స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నాడు.ప్రజలతో పోలీసుల సంబంధాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి సంబంధించి మన పోలీస్ శాంతి భద్రతల పటిష్ఠంగా ఉందని నేరస్తుల పట్ల కఠినంగా ఉండి బాధితుల పక్షాన హైదరాబాద్ పోలీసులు పని చేయాలని సూచించాడు.

హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ.. ఇక్కడ టూరిజం ఐటీ అన్ని అభివృద్ధి చెందుతున్నాయి. పోలిసులు అంటే నేరస్తుల భయపడాలి..సీసీ కెమెరాలు టెక్నాలజీ మరింత ముందుకు పోతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల పోలీసుల సమస్య పరిష్కారం చేయాలేకపోవచ్చు.. గౌరవ డిప్యూటీ సిఎం గారు బడ్జెట్ లో పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు.. సహాయం కొరకు వచ్చిన వారికి అండగా ఉండాలి .హైదరాబాద్ లో గాంగ్స్ ,గ్రూప్ లు లేవు.. చైన్ స్నచింగ్ లు కూడా జరగకుండా హైదరాబాద్ పోలీసులకు చిక్కుతమనే భయం ఉండాలి

  • Mro ఆఫీస్ కి నిధులు కేటాయిస్తం.
  • ప్రభుత్వానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ సమస్యలు తిరుస్తాం

డీసీపీ బాలస్వామి గారికి శుభాకాంక్షలు

ఈస్ట్ జోన్ ప్రజలు సురక్షితంగా ఉన్నామనే విధంగా ఉండాలి..కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ , ఐపీఎస్ లు విక్రమ్ సింగ్ మాన్ , రమేష్ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ , రొహిన్ రెడ్డి ,కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ,ఇతర పోలీస్ అధికారులు అంబర్పేట నియోజకవర్గం ప్రజలు రామ్మోహన్ శ్రీకాంత్ గౌడ్ లక్ష్మణ్ యాదవ్ లక్పతి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *