మద్యం సేవించి వాహనాలు నడపరాదు
- ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెంట్ ధరించాలి- సీఐ అనుముల శ్రీనివాస్
ఏటూరు నాగారం V3 News: మద్యం సేవించి ఎవరు కూడా వాహనాలు నడపకూడదని. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ మర్చిపోకుండా ధరించాలని ఏటూరు నాగారం సీఐ. అనుముల శ్రీనివాస్. ఎస్ఐ ఎస్.కె తాజుద్దీన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వై జంక్షన్ ప్రాంతంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు. ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు భద్రతపై. నియమ నిబంధనలు పాటించాలన్నారు. ఆదివారం కావడంతో వాజేడు మండలంలోని భోగాత జలపాతానికి. సందర్శకుల తాకిడి ఎక్కువగా పెరిగింది. సందర్శకులు బోగాత జలపాతాన్ని సందర్శించి వాహనదారులు ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురికా వద్దన్నారు. వాహనదారులకు బ్రీత్ ఎనర్జీతో తనిఖీలు చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వాహనదారులు మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడానికి ఎలాంటి హాని జరగకుండా ఉండడానికి నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు. మీ ఫోన్ ఎప్పుడు ఉపయోగించకూడదన్నారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని ఎల్లప్పుడు గుర్తుంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రోడ్డుపై వాహనాలు నిలుపరాదు
రోడ్డుకు ఇరువైపున పలు వ్యాపార సముదాయాల ముందు ద్విచక్ర వాహనాలు ఆటోలు ఇతర వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం. అతివేగం ప్రమాదకరమైన డ్రైవింగ్ . మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం. హెల్మెట్ లేకుండా వాహనం నడపడం. ద్విచక్ర వాహనంపై త్రిబుల్ రైడింగ్ చేయడం ఇట్టి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పు అని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ఏటూర్ నాగారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సివిల్. సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు