యునెస్కో వ్యవస్థాపకత విద్య సమావేశానికి ఎన్నికైన అసోసియేట్ ప్రొఫెసర్ డా.కొత్తిరెడ్డి మల్లారెడ్డి
కరీంనగర్( V3 News): యునెస్కో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ నెట్‌వర్క్ (ఇఇ-నెట్) లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా యువత కోసం సమర్థవంతమైన వ్యవస్థాపకతవిద్య వ్యూహాల రూపకల్పన గురించి ఉజ్బేకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో 10-11 అక్టోబర్ 2024న విద్యా సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపిక చేస్తూ తనకు యునెస్కో ఆహ్వానం పంపినట్లు ఎస్. ఆర్. ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల అసోసియెట్ ప్రొఫెసర్, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డా.కొత్తిరెడ్డి మల్లారెడ్డి తెలియజేసారు. ఈ సమావేశంలో వ్యవస్థాపకత విద్య 21వ శతాబ్దపు అనిశ్చితులను నావిగేట్ చేయడానికి మరియు యువతకు ఎదురయ్యే సమస్యల నుండి తిరిగి పుంజుకోవడానికి అవసరమైన వినూత్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎడ్యుకేషన్ నెట్‌వర్క్ (ఇఇ-నెట్) ప్రోగ్రామ్‌లను ప్రదర్శించడంతోపాటు, అనుకూలత, స్థితిస్థాపకతలు మరియు భవిష్యత్తు కార్యకలాపాల గురించి చర్చించనున్నట్లు పేర్కొన్నారు. యునెస్కో ఆసియా పసిఫిక్ ప్రోగ్రాం ఆఫ్ ఎడ్యుకేషన్ & ఇన్నోవేషన్ ఫర్ డెవలప్ మెంట్ (ఎ.పి.ఇ.ఐ.డి.) పేరుతో జరిగే ఈ సమావేశంలో వ్యవస్థాపక కార్యకలాపాలలో సాంకేతికత మరియు ఆవిష్కరణలను పెంపొందించడం, యువత ఎంట్రప్రెన్యూర్‌షిప్ కోసం సహాయక పర్యావరణ వ్యవస్థలను నిర్మించడం, ఇంక్యుబేటర్‌లు, యాక్సిలరేటర్‌లు, కో-వర్కింగ్ స్పేస్‌లు మరియు ఇతర యువత-ఆధారిత ప్రభుత్వ కార్యక్రమాలతో సహా యువత వ్యవస్థాపకత కోసం సహాయక, పర్యావరణ వ్యవస్థల నిర్మాణ మార్గదర్శకాలు చర్చించి కార్యాచరణ రూపొందించనున్నారు. వేగంగా మార్పుచెందుతున్న సామాజిక అవసరాలు, సమస్యల పరిష్కరణకు విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, ఇన్నోవేషన్ ద్వారా నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించి యువత వ్యవస్థాపకతకు అవసరమైన నైపుణ్యాలు, అవకాశాలు అందించే విధంగా వారు రూపొందించే నూతన స్టార్టప్స్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం. యువకుల్లో మానిసిక స్థైర్యం పెంపొందించడం మరియు సామాజిక, పర్యావరణ సమస్యల పరిష్కరణకు నూతన మార్గాలు అన్వేషిస్తూ సుస్థిర అభివృద్ధికి కృషి చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. యునెస్కో సమావేశానికి డా.కొత్తిరెడ్డి మాల్లారెడ్డి ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ డా.కల్వకుంట రామకృష్ణ, తెలంగా ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కె. సురేందర్ రెడ్డి, స్టాఫ్ సెక్రెటరి డా.ఎ. శ్రీనివాస్, జిల్లా బాధ్యులు డా.జి.శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపాల్స్ డా.ప్రమోద్ కుమార్, టి.రాజయ్య మరియు అధ్యాపకులు, విద్యార్థులు అభినందనలు తెల్పారు.