రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి మరో 10 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి సమీపంలోని క్రషర్ మీషన్ వద్ద సాగర్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మాడ్గల్ మండలం కొల్కులపల్లి గ్రామంలోని హైస్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్ టీచర్)గా విధులు నిర్వహిస్తున్న ప్రేమ్ కుమార్ మరియు నాగిల్ల గవర్నమెంట్ స్కూలో పనిచేస్తున్న మరో నాలుగు టీచర్లు కలిసి మాల్ నుండి క్రూజర్లో వస్తుండగా ఆగపల్లి సమీపంలోని క్రషర్ మీషన్ సాగర్ రహదారిపై క్రూజర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్ నుండి హైదరాబాద్ వస్తున్న క్రూజర్ ఇబ్రహింపట్నం నుండి ఆగపల్లి వస్తున్న షీఫ్ట్ కారును డీకోవడంతో అదే గ్రామానికి చెందిన వంగూరి ఎర్రేష్ (42) అక్కడికక్కడే మృతి చెందగా క్రూజర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు టీచర్లల్లో నాలుగురికి త్రీవ్ర గాయాలు కాగా సూర్య నగర్ కాలనీ ఉప్పల్ కు చెందిన స్కూల్ అసిస్టెంట్ ప్రేమ్ కుమార్(53) ఎల్బీనగర్ మ్యక్సిక్యూర్ హాస్పిటల్ చికిత్స పొందుతు మృతి చెందాడు. గాయాలైన టీచర్లను ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రికి తరలించారు.