వనదేవతలను దర్షించుకున్న మంత్రి సీతక్క
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న తెలంగాణ పంచాయతీరాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) మేడారంలో సీతక్క కు గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులు సన్నాయి,డోలువాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తులాభారం వేసుకోని 85 కిలోల నిలువెత్తు బంగారం ( బెల్లం) సమర్పించి వనదేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆనంతరం ఐటీడీఏ క్యామ్ప్ ఆఫీస్ లో 2024 ఫిబ్రవరి లో జరిగే మేడారం జాతర నిర్వాహణ విషయమై పలు శాఖలకు చెందిన అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు.జాతరలో వసతుల కోసం ప్రభుత్వం 75 కోట్లు కేటాయించిందని, పనులకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. జాతకు కోటి మంది భక్తులు వస్తారని,అన్ని శాఖల అధికారులు సమనవ్యయంతో పనిచేయాలని సూచించారు