Telangana

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ….చేవెళ్ల నియోజకవర్గం స్థాయిగా మొత్తం 80 మంది లబ్ధిదారులకు గాను 26 లక్షల 97 వేల రూపాయల చెక్కులను అందించినట్లు ఆయన వివరించారు అలాగే ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య విషయంలో ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండి సహాయ సహకారాలు అందించే దిశగా పనిచేస్తుందని ఇంకా మునుముందు ఎన్నో చెక్కులు అందిస్తామని ఈ చెక్కులను అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు కూడా తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో వీరేందర్ రెడ్డి, ఆగి రెడ్డి, దేవర వెంకటరెడ్డి, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *