Telangana

సేల్స్ ప్రమోషన్ యాక్ట్ 1976 ను పునరుద్ధరించాలి సిఐటియు డిమాండ్

తెలంగాణ మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ (టీ ఎం ఎస్ ఆర్ యు)(fmrai) ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం రోజు మున్సిపల్ టౌన్ హాల్ నుండి భారీ బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల గుండా అశోక్ చౌరస్తా, వన్టౌన్ చౌరస్తా ,రామ్ మందిర్ చౌరస్తా ,పన్ చౌరస్తా, గడియారం చౌరస్తా, పాత బస్టాండ్, తెలంగాణ చౌరస్తా, ఎర్ర సత్యం చౌరస్తా, డీఈఓ ఆఫీస్, రాజేంద్రనగర్, భయముతోట, మెట్టుగడ్డ ,ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, న్యూ టౌన్ మీదుగా టీటీడీ కళ్యాణమండపం దగ్గర సమ్మె శిబిరం లో ధర్నా జరిగింది.
ధర్నాకు ముఖ్య అతిథులుగా సిఐటియు రాష్ట్ర నాయకులుకీల్ల్ గోపాల్, సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి లు హాజరై ప్రసంగిస్తూ మెడికల్రీప్స్ సమస్యల పరిష్కారంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని. 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ ను రద్దు చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. తిరిగి ఆక్ట్ ను పునరుద్ధరించాలని. మందుల ధరలు తగ్గించాలని, మందులపై జిఎస్టి ఎత్తివేయాలని, మెడికల్ రిప్పులకు ఉద్యోగ భద్రత ,పిఎఫ్, ఈఎస్ఐ ,బోనసు, గ్రాటివిటీ ,పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, వేధింపులు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. సమ్మె శిబిరానికి మద్దతుగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ ,బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తిరుమలరెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మైనుద్దీన్, శ్రావణ్ కుమార్, మెడికల్ ఏజెన్సీల అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, మెడికల్ హోల్ సేల్ షాప్ ల రిటైల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పుల్ల, ఐ ఎం ఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వరదగాలన్న ,మెడికల్ అసోసియేషన్ వర్కింగ్ కమిటీ సభ్యులు మల్లికార్జున్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇమ్రాన్, శోభన్ యాదవ్ , సిఐటియు జిల్లా కోశాధికారి చంద్రకాంత్ ,పట్టణ సిఐటి యు కన్వీనర్ రాజకుమార్, మారుతి, రమేష్ తదితరులు సమ్మె శిబిరాలు ఉద్దేశించి ప్రసంగించారు. సమావేశంలో మెడికల్ రిప్రజెంటేటివ్ లు పెద్ద సంఖ్యలో హాజరైనారు. సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని బిజెపి అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని మందుల ధరలు తగ్గించాలని, జీఎస్టీ ఎత్తివేయాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని ,పోరాడితే పోయేది లేదు బానిస సంకెళ్లు తప్ప .ఐక్య పోరాటాలు వర్ధిల్లాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *