తడిచిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
- రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ను వ్యవసాయ శాఖ అధికారుల కు ఆదేశం.
రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కల్లాలలోని తడిసిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర పడవద్దని భరోసా ఇచ్చారు. రాయి బలేరి ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శనివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షం పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చే విధంగా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని, రైతుల నష్టపోకుండా చూడాలని అధికారులకు సూచన చేశారు. అలాగే ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.