Telangana

మిర్యాలగూడని డ్రగ్స్, గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం..MLA -BLR

మిర్యాలగూడ పట్టణంలో *మిర్యాలగూడ పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన *డ్రగ్స్ నిర్మూలన ర్యాలిని మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు జండా ఊపి ప్రారంభించడం జరిగింది. పట్టణంలోని 2 టౌన్ స్టేషన్ వరకు ర్యాలీ లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.. అలాగే మన మిర్యాలగూడ నియోజకవర్గంలో గత కొద్ది సంవత్సరాలుగా గంజాయి, డ్రగ్స్ లాంటి మారక ద్రవ్యల వ్యసనాలకు ఎంతో మంది యువత బానిసలుగా మారి వారి జీతంతో పాటు వారి కుటుంబ సభ్యుల జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు .. కానీ ఇకపై అలాంటి పరిస్థితి ముందు ముందు ఉండకుండా మిర్యాలగూడ నియోజకవర్గం గంజాయి, డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా తీర్చి దిద్దాలని మేము బలంగా నిర్ణయించుకున్నాం … గంజాయి, డ్రగ్స్ నీ పూర్తిగా నిర్మూలన చేసేందుకు పోలీస్ సిబ్బంది కూడా సీక్రెట్ సెర్చింగ్ చేస్తూ దాదాపు ఈ రెండు నెలల లోనే ఎంతో మంది డ్రగ్స్, గంజాయి వ్యాపారం చేసే వారిని మరియు సేవించే వారిని పట్టుకోవడం జరిగింది.. పోలీస్ అధికారుల కృషికి వారిని అభినందిస్తున్నాము .. ఇదే విధంగా పనిచేస్తూ డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలన చేయాలని పోలీస్ అధికారులను కోరారు.. అలాగే ముఖ్యంగా ఈ మారకద్రవ్యాల వ్యసనాలకు బానిసలు అవుతున్న యువకుల తల్లి తండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ వారి పిల్లల అలవాట్లపై శ్రద్ధ వహిస్తూ వారిని ఒక దారిలో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.. అలాగే ఈ గంజాయి, డ్రగ్స్ సేవించే వారి, వ్యాపారం చేసే వారి వివరాలు ఎవరికి తెలిసినా వెంటనే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అని అన్నారు.. అదేవిధంగా *ప్రతీ పాఠశాలలో, కాలేజీలో ఉదయం ప్రార్థన సమయంలో ఈ మారక ద్రవ్యాల నిర్మూలనపై కొద్దిసేపు పిల్లలకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *