NHRC&WEO ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బీ ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా NHRC & WEO జాతీయ అధ్యక్షులు, ఫౌండర్ మహమ్మద్ మొయినొద్దీన్ ఆదేశానుసారం , జాతీయ ప్రధాన కార్యదర్శి కాసగాని వేణు గౌడ్ పర్యవేక్షణలో , SC సెల్ అధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా NHRC& WEO ఇంచార్జ్ గనిపాక కుమార్ ఆధ్వర్యంలో హనుమకొండ అంబేద్కర్ సెంటర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గనిపాక కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప విషయం అన్నారు. అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ, నవ భారతాన్ని నిర్మించే బాధ్యత నేటి యువత పై ఉందని అన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న NHRC & WEO సభ్యులు అందరూ ఈ వేడుకలు జరుపుకుంటూ ,అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు వివరిస్తూ వారికి గల హక్కుల గురించి అవగాహన కల్పిస్తూ ప్రజలతో మమేకం అవుతున్న ఏకైక సంస్థ NHRC & WEO అని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ప్రెసిడెంట్ గోవర్ధన్, మల్యాల నరేందర్, జంగా.రఘువీర్ యాదవ్, సభ్యులు శ్యామ్ సుందర్, మేఘరాజ్, సుబ్రహ్మణ్యం, వంశీ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. .