NHRCWEO ఆధ్వర్యంలోప్రభుత్వ పాఠశాలలో బుక్స్ అండ్ స్టేషనరీ పంపిణీ
వరంగల్ జిల్లాలోని రెండవ డివిజన్ వంగపహాడ్ గ్రామంలో ఈ రోజున NHRCWEO చైర్మెన్ మహమ్మద్ మొయినొద్దీన్ ఆదేశానుసారం వంగపహాడ్ ప్రభుత్వ ప్రాధమికొన్నత పాఠశాలలో ఇంచార్జీ గనిపాక కుమార్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నోటుబుక్కులు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మొయినొద్దీన్ మాట్లాడుతూ గతంలో మాదిరిగానే విద్యా సంవత్సరం మొదలవగానే ఏదో ఒక పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ సంవత్సరం వంగపహాడ్ పాఠశాలను ఎంచుకున్నామని అన్నారు. విద్యార్థులు చదువుల్లో రానించి తల్లిదండ్రులకు , గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఇంచార్జి గనిపాక కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు జ్ఞానాన్ని సంపాదించి అన్ని రంగాల్లో ముందుండాలని కోరారు. అలాగే NHRCWEO నిరుపేదలకు అన్ని విధాలా సాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమం లో NHRCWEO జాతీయ కార్యదర్శి వేణు గౌడ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ , తిరుపతి, మేఘరాజ్, సుబ్రహ్మణ్యం, పరమెష్, ఆనంద్ కుమార్ రఘువీర్ నరేందర్ బాబు సంగారెడ్డి జిల్లా మహిళా వింగ్ అధ్యక్షురాలు అంజలి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు