Telangana

విద్యాతో పాటు యువకులు చెడు మార్గమున వెళ్లకుండా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి -సిఐ సదన్ కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ సూచనల మేరకు ఎస్ఐ శేఖర్ రెడ్డి నేతృత్వంలో మండలంలోని అన్ని గ్రామాల యువతకు దోస్తీ మీట్ -2024 క్రీడలను నిర్వహిస్తున్నారు. కబడ్డీ, వాలీబాల్ వంటీ క్రీడలను నిర్వహిస్తుండగా మండలంలో వివిధ గ్రామాల నుండి 30 జట్లు పాల్గొన్నాయి ఐదు రోజులపాటు వ్యాయామ ఉపాధ్యాయులుక్రీడలు ఆడించగా చివరి రోజు కబడ్డీ ఫైనల్ లో ముస్తాబాద్ గన్నివారిపల్లె తలపడగా మొదటి విజేతగా గన్నెవారిపల్లె ద్వితీయ స్థానంలో ముస్తాబాద్ నిలిచింది అలాగే వాలీబాల్ లో ముస్తాబాద్ నామాపూర్ తలపడగా మొదటి స్థానంలో ముస్తాబాద్ ద్వితీయ స్థానంలో నామాపూర్ నిలిచాయి ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా సిఐ సదన్ కుమార్. అలాగే ముస్తాబాద్ పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు చింతొజి శంకర్ విచ్చేసి విజేతలైన టీములకు సీఐ సదన్ కుమార్ ఎస్ఐ శేఖర్ రెడ్డి డాక్టర్ శంకర్ కలిసి బహుమతులు అందించి క్రీడాకారులను అభినందించారు . ఈ సందర్భంగా సీఐ సదన్ కుమార్ మాట్లాడుతు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దన్నారు. చదువుతో పాటు క్రీడలపై దృష్టిసారించాలన్నారు. పోలీస్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే యువత మంచిమార్గం వైపు అడుగులు వేస్తూ బంగారు జీవితానికి బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ పోటీలలో గెలిచిన టీం లకు జిల్లా స్థాయి లో పోటీలు నిర్వహించబడును తెలిపారు. అలాగే క్రీడలకు బహుమతులు స్పాన్సర్ చేసిన డాక్టర్ చింత శంకర్ శాలువతో సత్కరించారు వ్యాయామ ఉపాధ్యాయులను క్రీడలు ముందుండి ఆటలు ఆడించిన పోలీస్ శేఖర్ శ్రీనివాస్ ను సిఐ శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సీఐ సదన్ కుమార్ ఎస్సై శేఖర్ రెడ్డి డాక్టర్ శంకర్. పోలీస్ సిబ్బంది నేతలు గజ్జల రాజు కోలా కృష్ణ క్రీడాకారులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *