శ్యామల చెరువును మింగడానికి ప్రయత్నిస్తున్నారు
—-ప్రభుత్వం మారినా మారని నాయకుల తీరు
—–గతంలో బిఆర్ఎస్ లో ఉన్న నాయకులే
—-ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చి మళ్ళీ అధికారపార్టీ వాళ్లను కలుపుకొని కబ్జాకు ప్రయత్నం
హసన్ పర్తి మండలం,55వ డివిజన్ భీమారం గ్రామంలోని శ్యామల చెరువును కబ్జా చేయడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు.కబ్జాదారుల్లో గతంలో బిఆర్ఎస్ లో ఉండి ఈ మధ్య కాలంలో అధికార పార్టీలో చేరిన నాయకులే ఉన్నారు.అధికార పార్టీలో ఉంటే తాము గతంలో చేసిన కబ్జా భూమిని కాపాడడం కొరకే అధికార పార్టీలోకి చేరినట్టు వారి నడవడిక చూస్తే అర్ధం అవుతుంది.వీరు చేస్తున్న కబ్జాలు దళితులను టార్గెట్ చేసుకుని వారికి ఉండవలసిన సర్వే నెంబర్ భూమిని ఆధారముగా చెరువు శిఖము భూమి చూపించి, చెరువులో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఎస్ సి లకు ఎంతో కొంత ముట్టచెప్పి కబ్జాదార్లు పెద్ద మొత్తము దండుకుంటున్నారు.అధికారం మా చేతిలో ఉన్నది కాబట్టి మమల్ని గ్రామములో ఉన్న ప్రజలు కానీ, అధికారులు కానీ మమల్ని ఏమిచేయలేరనే ఉద్దేశముతో చెరువు లో ఉండవలసిన భూమి సర్వే నెం.642 లో 63 ఎకరాల భూమిలో 33 ఎకరాలు కబ్జా కాగా,ఇప్పటికి 30 ఎకరాల భూమి మిగిలింది.మిగిలిన భూమిని సైతం కొంతమంది భూ కబ్జా దళారులు కావాలని కొంతమంది అమాయకులకు ఎర వేసి వారితో భూమి తమదే అని రిజిస్ట్రేషన్ ఆశ చూపించి కబ్జాదారులు తిమ్మింగలములా మింగుతూ డబ్బులు దండుకున్నారని గ్రామస్తులు వారిని అసహించుకుంటున్నారు.గ్రామస్తుల పిర్యాదు మేరకు మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు శ్యామల చెరువు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు.శ్యామల చెరువు కబ్జాకు గురైన స్థలాన్ని పూర్తిగా కాపాడాలని భీమారం గ్రామస్తులు కోరుతున్నారు. చెరువు స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ఆకుల కుమార్,చింత లక్ష్మన్,బూర శరత్,నాతి సమ్మయ్య,బూర రాంరాజ్,బూర రామకృష్ణ (కిట్టు),సంగాల నాగరాజు,బేతల్లి యాకయ్య, ఉప్పు ప్రభాకర్,గడ్డం భగత్,చల్ల సంతోష్,నాతి రమేష్,వల్లాల శ్రీధర్,పప్పుల రమేష్,తదితరులు పాల్గొన్నారు.