టీఎస్ ఎప్ సెట్-2024 పరీక్షా ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎప్ సెట్ పరీక్షా ఫలితాలు నేడు యూనివర్సిటీ జూబ్లీ హాల్ లో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తోపాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబద్రి ఫలితాలను విడుదల చేశారు.ఎప్ సెట్ పరీక్షకు 3 లక్షల 31 వేల 251 మంది విద్యార్థులు హాజరయ్యారు.
అందులో 2 లక్షల 40 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కు అప్లై చేశారని తెలిపారు. 93 వేల మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ తదితర కోర్సులకు అప్లై చేశారని తెలిపారు. ఈసారి ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యవాడ జ్యోతిర్ ఆదిత్య 155.63 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా అగ్రికల్చర్ విభాగంలో ఆలూర్ ప్రణీత 146.44 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం వెల్లడించారు. ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే కమిటీని ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ కి సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఎప్ సెట్ పరీక్షలు జరుగుతున్నాయని కానీ తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు పూర్తిచేసుకుని నేడు ఫలితాలు విడుదల చేశామని అన్నారు దీనికోసం కృషి చేసిన ప్రతి ఒకరిని ప్రత్యేకంగా అభినందించారు