V3 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు
వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్యాంప్ కార్యాలయం లో నూతన సంవత్సర v3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ v3 న్యూస్ ఛానల్ గత ఐదు సంవత్సరముల నుండి ప్రజలకు వార్తలను సేకరించి అందించడంలో ముందుగా ఉంటుందని అన్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజల సమస్యలు తెలుసుకుని నిజాలను నిర్భయంగా తెలియపరచి అక్రమాలను బయటపెడుతూ ప్రజలకు తోడ్పడాలని కోరుకుంటున్నానని అన్నారు అదేవిధంగా వి త్రీ న్యూస్ ఛానల్ యజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమారుడు దిలీప్ 55వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు గడ్డం శివరాం 56వ డివిజన్ కొంక హరిబాబు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు