సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
ఒక సామాన్య కార్యకర్తను గుర్తుంచుకుని , కార్యకర్తలే దేవుళ్ళు అని సంబోధించిన సీఎం రేవంత్ రెడ్డి నిజంగా దేవుడని గ్రేటర్ వరంగల్ రెండవ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అరికి-ళ్ల సుమన్ అన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదని, పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తల కృషి ఉందని గుర్తుచేస్తూ కార్యకర్తల గుండెల్లో శాశ్వతంగా రేవంత్ రెడ్డి నిలిచిపోతారని సుమన్ అన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ రెండవ డివిజన్ వంగపహాడ్ లో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేఖం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలను భౌతికంగా దాడులు చేసినా తట్టుకుని పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతీ కార్యకర్తను గుర్తుంచుకున్న సీఎం రెవంత్ రెడ్డి మహనీయుడని కొనియాడారు. అలాగే ప్రస్తుత వర్దన్నపేట శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు కూడా పార్టీలో సీనియర్ లను గుర్తించాలని, కొత్తగా వచ్చిన ఇతర పార్టీల కార్యకర్తలకు, నాయకులకు వంత పాడకుండా పార్టీని కాపాడాలని కోరారు. ప్రజల్లో ఏ పథకానికి ఎవరు అర్హులో గుర్తించి వారికి లబ్దీ చేకూరెలా చూడాలని సూచించారు.