తుఫానుకు దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
రాజంపేట మండల పరిధిలో నిన్న తుఫాన్ దెబ్బకు నేల వాలిన పంటలను పరిశీలించిన రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి , ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో రామకృష్ణ రెడ్డి ఎమ్మార్వో సుబ్రమణ్యం రెడ్డి._రాజంపేట మండలంలోని వరదయ్య గారి పల్లి, కారంపల్లి, హస్తవరం చేర్లో పల్లి, బ్రాహ్మణ పల్లి, లింగరాజు పల్లి గ్రామాల్లో దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించిన ఆయన రాజంపేట మండలంలోని 2000 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయని ప్రాధమిక అంచనా వేసిన రెవెన్యూ అధికారులు, దీంతో మండలంలో దాదాపు 90 కోట్ల రూపాయల మేర రైతులు నష్టపోయినట్లు తెలిపిన ఎమ్మెల్యే . పంట నష్టాన్ని త్వరలో పూర్తిస్థాయి సమగ్ర దర్యాప్తు చేయించి మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతాను తెలిపారు. అన్నివిధాల నష్టపోయిన రైతన్నల కు ప్రభుత్వ సాయం అందిస్తామనీ అన్నారు. ఎవ్వరూ అదైర్య పడవలసిన పనిలేదని రైతన్నలకు జగనన్న అండగా ఉంటాడని బరోసా ఇచ్చిన ఎమ్మెల్యే, అధికారులతో మాట్లాడుతూ రాజంపేటలో నియోజవర్గంలో నష్టపోయిన ప్రతి రైతుని ఇబ్బంది కలగకుండా నష్టపోయిన ప్రతి రైతుకు వారి వారి పొలాల్లోని పంటలను పరిశీలించి సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు త్వరితగతిన రిపోర్టు పంపించి రైతులకు తక్షణమే న్యాయం చేయాల్సిందిగా హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సర్పంచులు ఎంపిటిసిలు వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.