దామెర గ్రామంలో అయ్యప్ప స్వామికి పంబా ఆరట్టు
ముక్కోటి ఏకాదశి సందర్బంగా హనుమకొండ జిల్లా దామెర కేంద్రంలో శనివారం రోజున హరిహర సూత అయ్యప్ప స్వామీ వారికి గురుస్వామి రమేష్ ఆధ్వర్యంలో , ఆరేపల్లి అయ్యప్ప సేవా సమితి గురుస్వామి గోపాల్ అధ్యక్షతన పంబా ఆరట్టు నిర్వహిస్తున్నట్టు అయ్యప్ప స్వామీ మాలాదారులు తెలిపారు. శనివారం ఉదయం గ్రామంలో గల హనుమాన్ దేవాలయం నుండి స్వామీ వారి ఊరేగింపు బయలు దేరుతుందని, శబరిమల లోని పంబా నదిని తలపించే విధంగా దామెర చెరువులో అయ్యప్ప స్వామికి జల క్రీడలు ఆడించి భక్తులు కూడా ఆ జల క్రీడలో పాల్గొనాలని గురుస్వామి రమేష్ తెలిపారు. స్వామి వారికి పంపా స్నానం అనంతరం పుష్పాభిషేఖం, పడిపూజా కార్యక్రమం ఉంటుందని గురుస్వామి చెప్పారు. గ్రామంలోని ప్రముఖులు, భక్తులు , దాతలు , గ్రామ ప్రజలు అందరి సహకారం తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సర్పంచ్ శ్రీరామ్ రెడ్డి తెలిపారు. స్వామి వారి పంబ ఆరట్టు తో పాటుగా గ్రామంలో పునః నిర్మితమవుతున్న శివాలయం లో నూతన దర్వాజా ప్రతిష్టాపన కూడా జరుగుతుందని ఆయన అన్నారు.
అయ్యప్ప సేవా సమితి సభ్యులు సునీల్, శ్రవణ్, సంపత్, తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రతీ ఒక్కరు భక్తి శ్రద్దలతో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని అయ్యప్ప స్వామి మాలాధారులు తెలిపారు..