మద్దికుంట లో శాంతి స్వరూపులు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా మహా పడిపూజ
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో కన్నె స్వామి కదిరే స్వామి గౌడ్ గృహంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని ముస్తాబాద్ శాంతి స్వరూపులు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం కన్నుల పండుగ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంపీపీ జనగామ శరత్ రావు పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, అయ్యప్ప ఉత్సవమూర్తి పంచామృతలచే అభిషేకాలు, వివిధ రకాల పూలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది అయ్యప్ప స్వాములు పాల్గొని భజన కీర్తనలతో మద్దికుంట గ్రామాన్ని భక్తి పరవశం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొని మహా పడిపూజ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి కృపకు ప్రాతులయ్యారు. అనంతరం స్వాములకు,భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావ్ జితేందర్ రావు. ఏఎంసి చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ కదిరే స్వామి గౌడ్ సతీష్ గౌడ్ కుటుంబ సభ్యులు మండల అయ్యప్ప స్వాములు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు