అంగన్వాడీ భవనాన్నిశంకుస్థాపన చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు
హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండల పరిధిలోని సుధాన్ పల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు సందర్బంగా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు 12లక్షల రూపాయల నిధులు అంగన్వాడి భవన శంకుస్థాపన గ్రామంలో 5 లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన చేసిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు
అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు….
అనంతరం అంగన్వాడి పిల్లలకు పుస్తకాలను పెన్నులను పంపిణీ చేసి వారితో సరదాగా గడపడం జరిగింది.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ గ్రామ రైతులకు 222 మందికి 1కోటి 45 లక్షల రుణమాఫీ చేసామన్నారు ఇంకా కొన్ని టెక్నికల్ సమస్యలతో రుణమాఫీ కానీ వారికి కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉంది అన్నారు. గ్రామంలో సిసి రోడ్లు 5 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసమన్నారు అలాగే గ్రామ ఇతర సమస్యలను పూర్తి చేపిస్తానని గ్రామ రైతుల కోసం కెనాల్ కాలువ శుభ్రం చేయించి అందుబాటులోకి తీసుకొని వస్తామని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు…..