మరియాపురం గ్రామానికి రాష్ట్రస్థాయి పర్యావరణ పురస్కారం రావడం చాలా సంతోషం…మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణిప్రసాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు జయదేవ్ లు మరియాపురం గ్రామ ప్రత్యేకాధికారి ఆడేపు ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి నల్లెల స్వప్నలకు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేసినట్లు మరియాపురం గ్రామం మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మరియాపురం గ్రామస్తులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి,సర్పంచ్ గా తాను ఎనలేని కృషి చేసినట్లు తెలిపారు.వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియాపురం గ్రామం రాష్ట్ర స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినందుకు ద్వితీయ ఉత్తమ గ్రామంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు తెలిపారు.మరియాపురం గ్రామానికి రాష్ట్ర స్థాయి పురస్కారం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.