అంగరంగ వైభవంగా శివాని జూనియర్ కళాశాలల ఫేర్ వెల్ పార్టీ ఫెస్ట్…సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి గౌడ్
హనుమకొండ భీమారం చింతగట్టు క్యాంపు సమీపంలోని MTR గార్డెన్స్ లో రెండో రోజు శివాని జూనియర్ కళాశాలల ఐఐటీ,నీట్ బ్యాచుల ఫేర్ వెల్ పార్టీ ఫెస్ట్ కార్యక్రమంను అట్టహాసంగా నిర్వహించినట్లు శివాని జూనియర్ కళాశాలల సెక్రటరీ తాళ్లపల్లి స్వామిగౌడ్ శుక్రవారం మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల సెక్రెటరీ తాళ్లపల్లి స్వామి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల విజయానికి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని,అదే విధంగా ఆత్మవిశ్వాసానికి సాధనతో పాటు కఠోర శ్రమతో అత్యున్నత శిఖరాలను చేరుకోవచ్చునని తెలిపారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీమ్,కిస్మత్ టీమ్ సినిమా సభ్యులు,శివానీ కళాశాలల డైరెక్టర్లు సురేందర్ రెడ్డి చంద్రమోహన్ గౌడ్,రాజ్ కుమార్,రమేష్,మురళీదర్,
సంతోష్ రెడ్డి,సురేష్,తల్లిదండ్రులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.