Telangana

Manakondur: మానకొండూర్ మండలం పచ్చునూరు కు చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి హత్యకు పాల్పడ్డ నిందితుల అరెస్ట్

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి హత్య గత నెల 28 వ తేదీన జరిగిన విషయం విధితమే.దీనికి గల ముఖ్య కారణం వ్యక్తిగత కక్షలే అని విచారణలో తేలిందని కరీంనగర్ రూరల్ ఏసీపీ పి. వెంకటరమణ తెలిపారు. మృతుడి సోదరుడైన గోపు శ్యామ్ సుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మానకొండూరు పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కథనం ప్రకారం మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన మద్దెల వెంకటేష్ మరియు బండి సాయిలు అనే ఇరువురి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థల భూ వివాదం ఉండేదని , అట్టి విషయం లో పలుమార్లు వారివురికి పంచాయతీ జరిగిందని అయితే బండి సాయిలుకు మద్దతుగా గోపు ప్రశాంత్ రెడ్డి ఉండగా , మద్దెల వెంకటేష్ కి మద్దతుగా హత్యలో ప్రధాన నిందితులైన నన్నవేనీ రమేష్, గాజు శంకర్ లు వున్నారని అప్పటినుండే వారి మధ్య విభేదాలు తలెత్తాయని అన్నారు. గతంలో జరిగిన ఇదే భూమి పంచాయితీలో గాజు శంకర్ , మృతుడు గోపు ప్రశాంత్ రెడ్డి ని కొట్టాడని దానితో వీరి మధ్య వివాదం మరింత ముదిరిందని తెలిపారు. దీనితో ఒకరినొకరు తిట్టుకోవడం, బెదిరింపులకు పాల్పడడంతో ప్రధాన నిందితుడు నన్నవేనీ రమేష్ , గాజు శంకర్ లకు మరియు మృతుడికి మధ్య కక్ష పెంచుకున్నారని విచారణలో తేలిందన్నారు. ఈ విధంగా అడ్డుగా వున్న గోపు ప్రశాంత్ రెడ్డిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని లేని పక్షములో గోపు ప్రశాంత్ రెడ్డి నుండి రమేష్ మరియు అతని కుటుంబానికి ప్రాణ హాని ఉందని గ్రహించి, నిర్ణయించుకుని పథకం ప్రకారం ప్రధాన నిందితుడైన నన్నవేనీ రమేష్ తో పాటు అతని స్నేహితులు గాజు శంకర్ , మద్దెల వెంకటేష్ , మరికొంతమందైన రమేష్ అనుచరులతో గోపు ప్రశాంత్ రెడ్డిని చంపాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం గత నెల 28 వ తేదీన పచ్చునూరు గ్రామములో వెతకగా , ఉదయం 05. 30 గంటలకు ఉటూర్ గ్రామంలో మృతుడు ఉన్నాడని అతని ఆచూకీ తెలుసుకుని అతడిని వెంబడించి కిరాతకంగా కొట్టి , గర్రెపల్లి గ్రామ శివారులోని మానేరు వాగు సమీపంలో హత్య చేశారని అంగీకరించినట్లు తెలిపారని అన్నారు.

 1. నన్నవేనీ రమేష్ మానకొండూర్ మండలం పచ్చునూరు ప్రస్తుతం రేకుర్తి
 2. సుల్తానాబాద్ కి చెందిన అంతడుపుల సాయి కృష్ణ @ ఎస్ కె భాయ్
 3. తాండ్ర మహేష్ మానకొండూర్ మండలం లక్ష్మీపూర్
 4. కూరాకుల అనిల్ మానకొండూర్ మండలం పచ్చునూరు
 5. సర్దార్ కుల్దీప్ సింగ్ @ కార్తీక్ కరీంనగర్ కిసాన్ నగర్
 6. పొన్నాల మనోహర్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం
 7. ఏరుకొండ మహేష్ హుజురాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్ ప్రస్తుతం కరీంనగర్ లోని పద్మశాలి నగర్ 8. కొమ్మడవేని హరీష్ కరీంనగర్ కోతిరాంపూర్ పోచమ్మవాడ
 8. ఓడ్నలా యజ్ఞేశ్ గంగాధర మండలం పాతికుంటపల్లి. లను అల్గునూర్ క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నామని , మిగిలిన నలుగురు పరారీలో వున్నారని తెలిపారు
 9. గాజు శంకర్ మానకొండూర్ మండలం పచునూరు
 10. సుకే ఉదయ్ కుమార్ @ చింటు మానకొండూరు మండలం లక్ష్మీపూర్
 11. మద్దెల వెంకటేష్ మానకొండూర్ మండలం పచునూరు
 12. నన్నవేనీ భాగ్యలక్ష్మిలు హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారని, మృతుడి హత్యకు కారణమయ్యారని విచారణలో తేలిందని వీరిపై ఐపీఎస్ 147,148,364,302,506,201,212,109,120-బి రెడ్ విత్ 149 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి ప్రస్తుతానికి మొదటి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్ కు తరలించామని, మిగిలిన వారు పరారీలో వున్నారని రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతున్నదని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి హత్యకు కారణమైన ఏ ఒక్కరిని వదిలి పెట్టబోమని ప్రతి ఒక్క నిందితుడికి శిక్ష పడేలా చర్యలు చేపడతామన్నారు.

హత్యకు ఉపయోగించిన ఒక స్విఫ్ట్ కారు, ఒక బ్లాక్ కలర్ మాడిఫైడ్ జీప్ , రెండు టూ వీలర్లను , 06 స్మార్ట్ ఫోనులు , రెండు కత్తులను స్వాధీన పరుచుకున్నామని తెలిపారు.

కేసులో ప్రధాన నిందితులని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించుటకు కృషి చేసిన ఇన్స్పెక్టర్ మానకొండూరు మరియు సిబ్బందిని రూరల్ ఏసీపీ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *