Telangana

అపూర్వ పాఠశాలలో 24 వ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్

  • విద్యార్థులు తయారుచేసిన ఆర్ట్ లు ఎంతో ఆకట్టుకున్నాయి
  • పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకే క్రాఫ్ట్ ఎగ్జిబిషన్
  • అపూర్వ పాఠశాల ప్రిన్సిపల్ కుస్మ రెడ్డి

నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి లోని అపూర్వ పాఠశాల లో 24 ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కుస్మ రెడ్డి మాట్లాడుతూ.. మన ఇంట్లో ప్రతినిత్యం వాడే వేస్ట్ మెటీరియల్ తో డెకరేటివ్ ఐటమ్స్, యుటిలిటీ ఐటమ్స్ తయారుచేయడం జరిగిందని ఆమె తెలిపారు. వేస్ట్ మెటీరియల్ తో వివిధ రకాల ఆకృతులను ఇలా తయారు చేయాలో ఉపాధ్యాయునిలు విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు,నాణాలతో తయారుచేసిన వివిధ రకాల ఆకృతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఇయర్ బర్డ్స్ తో పువ్వులు,చెట్లు వివిధ రకాల ఆకృతులు, వాటర్ బాటిల్స్ తో పెన్సిల్ స్టాండ్స్, ఫ్లవర్ వేస్, ప్లాంట్స్, ఆయిల్ క్యాన్స్ తో ప్లాంటర్స్, షూ బాక్స్ లతో స్టోరేజ్ బాక్స్లు కాట్ బోర్డ్స్ తో టిష్యూ హోల్డర్స్, కార్డు బోర్డ్ మరియు క్లాత్ ఉపయోగించి లేడీస్ హ్యాండ్ పర్సులనుతయారు చేయడం జరిగిందని అన్నారు. గ్లాస్ బాటిల్స్ తో డెకరేటివ్ ఫ్లవర్ వేస్, ఐస్ క్రీమ్ పుల్లలతో ఫోటో ఫ్రేమ్స్ లు తయారు చేయడం జరిగిందని ఆమె అన్నారు. అపూర్వ పాఠశాలలో 400 విద్యార్థులకు గాను 32 ఉపాధ్యాయినీలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించిన వివిధ రకాల ఆకృతూ తయారు చేయడానికి శిక్షణ ఇచ్చారని ఆమె తెలిపారు. అపూర్వ పాఠశాలలో ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు ఇక్కడ క్రాఫ్ట్ టీచర్ అని,చాలా చక్కగా పనిచేస్తారని,దీని ద్వారా విద్యార్థుల్లో క్రియేటివిటీ అనేది పెరుగుతుందని . ఈ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ వలన పిల్లల్లో ప్రోత్సాహం పెరిగి ఉత్సాహంతో నేర్చుకుంటారని అన్నారు.. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వేస్ట్ గార్బేజ్ ని వాడడం వలన రీసైక్లింగ్ చేయబడుతుందని విద్యార్థులు తెలుసుకుంటారని ఆమె తెలిపారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు సందర్శించి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆకృతులను తిరిగించారని,వారిని ఎంతో ఆకట్టుకున్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అపూర్వ పాఠశాల ఉపాధ్యాయునిలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *