ఆది శీనన్న కు ప్రభుత్వ విప్ – వేములవాడ రాజన్న ఆలయం నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి తెలంగాణ ప్రభుత్వ విప్ గా నియమతులైన సందర్భంగా ఈరోజు శనివారం వేములవాడ రాజన్న గుడి నుండి కొండగట్టు అంజన్న వరకు పాదయాత్ర చేసిన వేములవాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి కిరణ్, గుడిసె మనోజ్, గుండు హరీష్ వీరు పాదయాత్ర చేస్తున్నారు వీరికి వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గుడి ముందు కండువా కప్పి సాగనంపారు. ఈ సందర్భంగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రియతమ నాయకుడు గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ప్రభుత్వ విప్ రావడం చాలా సంతోషదాయకమని వారన్నారు. ప్రభుత్వ విప్ వచ్చిన సందర్భంగా పాదయాత్ర చేస్తున్న వీరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు ఆ రాజన్న ఆ అంజన్న దయవల్ల చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పాత సత్యలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు దూలం భూమేష్ సిరిగిరి శ్రీకాంత్ తోట రాజేష్ కుతాడి రాజేశం తదితరులు ఉన్నారు.