ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు కు ఘన స్వాగతం పలికిన విజయరామరావు
పెద్దపల్లి జిల్లా న్యూస్ (V3 న్యూస్) :తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కు పెద్దపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని పర్యటనకు వెళ్తుండగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉప ముఖ్యమంత్రి కి పుష్పగుచ్చా అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు, మరియు తదితరులు పాల్గొన్నారు.