కాంటెస్ట్ ఎమ్మెల్యే రాయపురం సాంబయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలి
వరంగల్ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో20 గ్రామ లా ముఖ్య నాయకుల సమావేశం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ కాంటెస్ట్ ఎమ్మెల్యే రాయపురం సాంబయ్య హాజరయ్యారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి 67వ వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించినందుకు అధిష్టానం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు నేను గత 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నానని ఎస్టీ రిజర్వేషన్లు 2018లో 2023లో మహబూబాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశించానని కానీ కాంగ్రెస్ అధిష్టానం వేరే వారికి టికెట్టు ఇచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థులకు మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళి నాయక్ నా సొంత నియోజకవర్గ అగు వర్ధన్నపేట నియోజకవర్గం కెఆర్ నాగరాజు కు నా వంతు కృషి చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవడానికి నయవంచన లేకుండా కృషి చేశానని అన్నారు కావున కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి ఎస్టీ ఎరుకల కులానికి చెందిన నాకు ఎమ్మెల్సీ ఇవ్వగలరని వేడుకున్నారు అనంతరం ఐలోని మండల నాయకులు మరి కొంతమంది మాట్లాడుతూ ఎరుకల కులం కు చెందిన మా రాయపురం సాంబయ్యకు ఎస్టి కోటలో ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ మండల నాయకులు గ్రామ పార్టీ అధ్యక్షులు మహేష్ కాంగ్రెస్ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు