Telangana

ప్రభుత్వ కేడీసీ లో ఆర్ధిక అంశాల్లో పలు సంస్కరణల పై జాతీయ సదస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి .

హన్మకొండ ప్రభుత్వ కళాశాల హనుమకొండలో “ఫిన్ టెక్ ది ఇంక్లూజివ్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్” అనే అంశంపై వాణిజ్య శాస్త్ర విభాగం వారు నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సుకు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు …
ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత పై పాఠ్యాంశాలు రూపొందించి నేర్పడం ద్వారా భవిష్యత్ తరాలు ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సురక్షితంగా మరియు సులభంగా ఉపయోగించుకోవచ్చునని పేర్కొన్నారు…
ఈ సందర్భంగా జాతీయ సదస్సు సంచికను ఆవిష్కరించారు…
ఈ సందర్భంగా కళాశాల కోసము సుమారు పది లక్షల విలువ గల స్టూడెంట్ డెస్కులను అందజేయనున్నట్టు వారు తెలియజేశారు…
అతిధిగా హాజరైన ఏఐసిసి సభ్యులు ,పీసీసీ కార్యదర్శి బొ ద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా కళాశాల అభివృద్ధికి నిత్యం అందుబాటులో ఉంటానని కేడిసికి A+ grade రావడానికి పూర్వ విధ్యార్ధుల క్రుషి ఉందని ఈ కాళాశాలకు కావలసిన అభివ్రుద్ది ,మౌళిక వసతుల కొరకు మన శాసన సభ్యులు నాయిని రాజేందర్‌రెడ్డి క్రుషి చేస్తాడని పేర్కొన్నారు…మన విధ్యార్థుల తరగతి నూతన గదుల్లో కూర్చోవడానికి ఫర్నీచర్ ,డెస్కులను సమకూర్చుటకు తక్షణం అవసారినికి 10 లక్షలు తన నియోజకవర్గం అభివ్రుద్ది ఫండ్‌ నుండి మంజూరు చేసినందుకు పూర్వ విధ్యార్థుల సంఘ పక్షాణ క్రుతజ్ఞతలు తెలియజేసారు.
అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర ఆచార్యులు డాక్టర్ రాజేందర్ గారు సదస్సును ఉద్దేశించి మొదటి రోజు కీలక ఉపన్యాసం చేశారు…
ఈ సందర్భంగా వీరు ఆర్థిక అక్షరాస్యత ఆచరణలు, డిజిటల్ ఫైనాన్స్, ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానంలో సవాళ్లు,
సాంకేతిక పరిజ్ఞానము మరియు ఆర్థిక అక్షరాస్యతకు సంబందించి రూపొందించవలసిన పాఠ్యాంశాలు, అందరికీ ఆర్థిక అక్షరాస్యతను అందించే మార్గాలు మొదలగు అంశాలపై విస్తృత ఉపన్యాసం చేశారు…
అనంతరం రాష్ట్రంలోని వివిధ కళాశాల నుండి వచ్చిన అధ్యాపకులు పరిశోధకులు జాతీయ సదస్సు పై వారు సిద్ధం చేసిన పరిశోధనా పత్రాలను సదస్సులో సమర్పించారు…
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజారెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సదస్సు ప్రారంభ సమావేశంలో విశ్రాంత అధ్యాపకులు సోమిరెడ్డి , భాస్కర రావు, కళాశాల అధ్యాపకులు డాక్టర్ మల్లయ్య డాక్టర్ రమేష్, వాణి జ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వినోదర్ రావు, సదస్సు నిర్వాహకులు లింగారెడ్డి, పావని, సుజాత, ఝాన్సీ రాణి, రాజీరు, నవీన్, స్వర్ణలత ,సునీత రాణి , బాల చందర్ విద్యార్థులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *