జాతీయ పురస్కారం అందుకున్న పొగాకు రాజేశ్వర్
యువచైతన్య వెల్ఫేర్ సొసైటీ , విశ్వకర్మ సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్, స్వామీ వివేకానంద జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ సేవా రంగాల్లో కృషి చేసిన ఉత్తములకు జాతీయ పురస్కారాలను అందజేశారు. వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ మూడవ డివిజన్ కు చెందిన ప్రముఖ సామాజిక వేత్త, సాంఘిక సంఘ సంస్కర్త, రంగస్థల నటులు పొగాకు రాజేశ్వర్ గారు ఆదివారం వరంగల్ టీ ఎన్ జీ ఓ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ పొగాకు రాజేశ్వర్ గారి లాంటి అరుదైనా వ్యక్తులకు ఇలాంటి పారస్కారాలు అందజేయడం గొప్ప విషయం అన్నారు. సాంఘిక, రంగస్థల రంగాల్లో రాణిస్తూ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ అందరి మన్ననలు కళా రంగంలో యాభై కి పైగా సంవత్సరాలుగా నటుడిగా రాణిస్తూ అనేక అవార్డులు పొంది, సహచర కళాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. నిత్య విద్యార్థిగా సాధన చేస్తూ ప్రతీ రంగంలో రానించ వచ్చని నిరూపించిన పొగాకు రాజేశ్వర్ కు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ పురస్కార గ్రహీత రాజేశ్వర్ మాట్లాడుతూ యువచైతన్య వెల్ఫేేర్ సొసైటీ వారు నాలాంటి వారిని గుర్తించి వారిని సన్మానించడం అభినందనీయం అన్నారు. ఇలాంటి పురస్కారాలు అందజేయడం వల్ల సమాజంలో గల నాలాంటి వారికి ఉత్తేజం కలుగుతుందని అన్నారు. పొగాకు రాజేశ్వర్ కు జాతీయ స్థాయిలో పురస్కారం లభించడం పట్ల ఆరేపల్లి గ్రామస్థులు, కళాభారతి సాంస్కృతిక సంస్థ సభ్యులు అభినందనలు తెలియజేసారు. ..