డిస్నీ ల్యాండ్ ఇ టెక్నో పాఠశాల 10వ తరగతి విద్యార్థి జంగా మణి సంకల్ప్ రాష్ట్ర స్థాయి ఇన్ స్పైర్ అవార్డుకు ఎంపిక
హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ లోని డిస్నీ ల్యాండ్ ఇ టెక్నో పాఠశాల 10వ తరగతి విద్యార్థి జంగా. మణి సంకల్ప్ రాష్ట్ర స్థాయి ఇన్ స్పైర్ అవార్డుకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ శోభారాణీ, డైరెక్టర్లు రాకేష్ భాను, దినేష్ చంద్ర తెలిపారు. ఇటీవల జిల్లా స్థాయి లో జరిగిన జిల్లా స్థాయిలో జరిగిన ఇన్ స్పైర్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శన కనబరచి రాష్ట్ర స్థాయి ఇన్ స్పైర్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. “హైడ్రాలిక్ స్టాండ్ టు టూ వీలర్స్” అనగా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు సైడ్ స్టాండ్ తీయకుండా ప్రయాణించున్నప్పుడు ప్రమాదాలకు గురి కాకుండా తీసుకునే నివారణా చర్యలు అనే అంశం పై చక్కటి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి ఇన్ స్పైర్ అవార్డుకు ఎంపికైన విద్యార్థి జంగా మణి సంకల్ప్ ను పాఠశాల ముఖ్య సలహాదారులు డి. మల్లయ్య, డి. సదయ్య, బి. లక్ష్మీనివాసం గార్లు అభినందించారు. ఈ అంశంపై శిక్షణ ఇచ్చిన సైన్స్ ఉపాధ్యాయులు ఎస్.శివాజీ, ఎం.రాజిరెడ్డి, ప్రసాద్, సురేష్ బాబు , రవి కుమార్, శ్రీమతి జయలక్షి, భవ్య గార్లను పాఠశాల యాజమాన్యం ప్రశంషించారు.