Telangana

అయిదేండ్ల లోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని తల్లిదండ్రులను కోరిన – సంగాల విక్టరీబాబు

*5 ఏళ్ళ లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయిద్దాం - చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం*

 *భీమారం 55వ డివిజన్ పరిధిలోని  మెయిన్ రోడ్డులో గల మెడికెర్ ఫార్మసిలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి నాయకపు అభిరామకృష్ణ (చినోడి తల్లి భానుప్రియ)చిన్నారి కీ పోలియో చుక్కలు వేసిన విక్టరీబాబు* 

విక్టరీబాబు గారు మాట్లాడుతూ పోలియో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా పల్స్‌ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని పోలియో చుక్కలు చిన్నారులకు శ్రీ రామ రక్షయని, తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని తమ చిన్నారులకు విధిగా వేయించాలన్నారు. ఆరోగ్య భారత్‌ను నెలకొల్పేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విక్టరీబాబు పిలుపునిచ్చారు. పుట్టిన పాప నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని విక్టరీబాబు గారు తెలియజేసారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ మార్చి 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం డివిజన్ లోని పోలియో కేంద్రాల్లో వైద్యారోగ్య సిబ్బందితో పిల్లలకు చుక్కల మందు వేస్తున్నట్లు చెప్పారు. 3వ తేదీన కేంద్రాల్లో వేయించుకోనివారు ఆ తర్వాత రెండు రోజులపాటు సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, చుక్కలు వేసుకోని వారిని గుర్తించి పిల్లల ఇంటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా బస్టాండ్‌లు,రైల్వే స్టేషన్‌లు,దవాఖానాలు, పాఠశాలలు,కమ్యూనిటీ హాళ్లు సహా ప్రధాన కూడళ్ల వద్ద ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారని సంగాల విక్టరీబాబు ఈ సందర్బంగా తెలియజేసారు.

 ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ బిసుపాక సువర్ణ, వేల్పుల సరోజన,ఆర్ పి బొక్క కమలమ్మ, మెడికేర్ ఫార్మసీ అధికారి గట్టు హేమచేందర్,కొండేటి హరీష్, బ్రెట్ బెస్ ప్లై స్కూల్ వారు ఈకార్యక్రమంలో వారికీ సహాకరిచారు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *