నేషనల్ హ్యుమాన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ నుండి సహాయ కార్యదర్శి తొలగింపు
నేషనల్ హ్యుమాన్ రైట్స్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ నుండి సహాయ కార్యదర్శి గా కొనసాగుతున్న బయ్యారం గ్రామానికి చెందిన గోనె శ్రీనివాస్ S/O రామచంద్రయ్య ను ఆ బాధ్యతల నుండి తొలగించినట్లు NHRC& WEO చైర్మన్ మొయినొద్దీన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. గోనె శ్రీనివాస్ అనే వ్యక్తి ఆర్గనైజేషన్ కార్యకలాపాలను తమ సొంత పనులకు వాడుకుంటున్నట్లు, అలాగే ఆర్గనైజేషన్ నియమ నిబంధనల విషయంలో కూడా అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం తెలియడంతో ఆయనను ఆ పదవి నుండి తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి నుండి ఆర్గనైజేషన్ కు అతనికి ఎలాంటి లావాదేవీల గానీ సత్సంబదాలు గానీ ఉండబోవని చైర్మన్ మొయినొద్దీన్ తెలిపారు. గతంలో కూడా అతను ఆర్గనైజేషన్ కు తెలియకుండా ఏవైనా అవకతవకలు చేస్తే మాకు సంబంధం లేదని తెలియజేసారు. అలాగే NHRC& WEO లో ప్రస్తుతం కొనసాగుతున్న సభ్యులు ఎవరైనా స్వార్థ ప్రయోజనం కోసం ఆర్గనైజేషన్ పేరు వాడుకున్నట్లు సమాచారం అందితే వారిని కూడా సంస్థ నుండి తొలగించి వారిపై చట్టారీత్యా చర్యలు తీసుకుంటామని చైర్మన్ మొయినొద్దీన్ తెలిపారు.