పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు-కడియం కావ్య
హన్మకొండ లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, నగర మేయర్ గుండు సుధారాణి గారు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గార్లతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు… అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా అభ్యర్థి కడియం కావ్య గారి పై నమ్మకంతో ల్ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు మీ మీద ఇంత నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ హామీలన్నింటిని నేరవెర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి ముఖ్యంగా వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ అమలు, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా ఏర్పాటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హైదరాబాద్ భూపాలపల్లి నేషనల్ హైవే ను ఇండస్ట్రీయల్ కారిడర్ గా అభివృద్ధి చేయడం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే గారు ఎంపీ గారికి తెలియజేయడం జరిగింది…