బడిబాటఇంటింటిప్రచారంలోపాల్గొన్నకార్పొరేటర్జక్కుల రవీంద్ర యాదవ్
కాజీపేటపట్టణం, 62వ డివిజన్ సోమిడిలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాటలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సోమిరెడ్డి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గార్ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటింటి ప్రచారంలో జక్కులదంపతులు* జక్కులరమరవీందర్యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్ పాల్గొని ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ పుస్తకాలు, రుచికరమైన పౌష్టిక విలువలు కలిగిన మధ్యాహ్నం భోజనం, రాగిజావా మరియు అల్పాహారం అందించబడుతుందని కావున తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని జాయిన్ చేయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు…. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బల్ల.సతీష్_కుమార్ ఉపాధ్యాయులు కె.రాములు, కె.శోభారాణి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పి.హరిత పాల్గొన్నారు…