పోలీస్ సిబ్బంది పిల్లలకి సమ్మర్ క్యాంపు ప్రారంభం.కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని జాన్ విల్సన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ నందు పోలీస్ సిబ్బంది పిల్లలకు వేసవి సెలవుల సందర్బంగా సమ్మర్ క్యాంపు ను శుక్రవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ప్రారంభించారు. ఈ క్యాంపు రెండు వారాలపాటు కొనసాగుతుందన్నారు. ఈ క్యాంపు లో భాగంగా పిల్లలకు డ్రాయింగ్ , పెయింటింగ్ , డాన్స్ , సింగింగ్ , అథ్లెటిక్స్ , కరాటే, ఫుట్ బాల్ , క్రికెట్ వంటి వాటిల్లో శిక్షణ ఇప్పించనున్నామన్నారు. దానికి గాను సుశిక్షితులైన టీచర్లను, కోచ్ లను నియమించామన్నారు. పిల్లలకు చదువులతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యతనిచ్చేలా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. ఆటల వలన మానసికోల్లాసమే కాకుండా శారీరక ధృడత్వంతో పాటు ఆత్మవిశ్వాసమూ పెంపొందుతుందన్నారు. పిల్లలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శాంతి భద్రతలు ఏ లక్ష్మీనారాయణ , రిజర్వు ఇన్స్పెక్టర్లు సురేష్ (అడ్మిన్ ), శ్రీధర్ రెడ్డి (వెల్ఫేర్) లతో పాటు టీచర్లు, కోచ్ లు పాల్గొన్నారు.