Telangana

ప్రజాదర్బార్ నిర్వహిస్తా..! ప్రతిసమస్య తీరుస్తా..!-బిజెపి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్

  • ప్రజాదర్బార్ నిర్వహిస్తా..! ప్రతిసమస్య తీరుస్తా..!
  • ఎన్నోఏoడ్ల కల నేడు నెరవేరిన వైనం…
  • ఆఖరి వరకు భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతా..!

బిజెపి గెలుపునకు పాత్ర వహించిన ప్రతి నాయకులకు,కార్యకర్తలకు, ఓటర్లకి ప్రత్యేక ధన్యవాదాలనీ, ఆఖరి వరకు భారతీయ జనతా పార్టీలోనే కొనసాగి, ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని ముధోల్ తాలూకా బిజెపి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు…తాలూకాలో ఎన్నో ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని అందరూ కలలు కన్నరని,నేడు ఆ కల నెరవేరిందని, అందరినీ కలుపుకుపోయి అభివృద్ధి వైపుకు సాగుతానని,రాష్ట్ర ప్రభుత్వంతో పోట్లాడి మరి నిధులు తీసుకొస్తామని, అవసరమైతే కేంద్ర నిధులు తీసుకొచ్చేనా అభివృద్ధి చేస్తానని అన్నారు. పార్టీ మారుతున్నారని వచ్చే అపోహలు ఎవ్వరూ కూడా నమ్మవద్దనీ,పార్టీ మరే ప్రసక్తి లేదనీ తెలిపారు.గత నెల రోజులుగా వార్తలు కవరేజ్ చేసిన మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *