వరంగల్ కోర్ట్ జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో CAO కుమ్మరి జగన్నాధం పదవీ విరమణ సన్మానం
ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టులో గత 37 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేసి శనివారం పదవీ విరమణ చేస్తున్న చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న కుమ్మరి జగన్నాధం దంపతులను వరంగల్ అండ్ హనుమకొండ జిల్లాల జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హనుమకొండ జిల్లా జడ్జి రమేష్ బాబు,వరంగల్ జిల్లా జడ్జి ఏబీ. నిర్మలా గీతంబా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమ్మరి జగన్నాధం చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జ్యుడీషియల్ ఎంప్లాయిస్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు బుజ్జి బాబు,జనరల్ సెక్రెటరీ నిమ్మల రాజు,హనుమకొండ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్, జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్,కోర్టు ఉద్యోగులు,సిబ్బంది, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.