విద్యార్థులు ఒక లక్ష్యంతో చదివి అత్యున్నత శిఖరాలను చేరుకోవాలి…చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు
వరంగల్ ములుగురోడ్డు డాక్టర్స్ కాలనీ లోని శ్రీ శివానీ కాలేజీ ఆఫ్ ఫార్మసీ జూనియర్ కళాశాలలో బీఫార్మసీ,ఫామ్ డి 2వ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ డే పార్టీ బుధవారం అట్టహాసంగా నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు
తెలిపారు.ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు,వద్దిరాజు గణేష్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యనందు అభిరుచి కలిగి ఆసక్తితో,క్రమశిక్షణతో ప్రణాళికబద్దంగా చదివితే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చనన్నారు.
ఫామ్ డి మొదటి సంవత్సరం విద్యార్థిని రుషాలి 1 st ఇయర్ ఫలితాల్లో కేయూ రెండో ర్యాంకు సాధించిన సందర్భంగా ఆమెను నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించారు.అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ, కరస్పాండెంట్ వద్దిరాజు గణేష్
ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ బాబు,వైస్ ప్రిన్సిపాల్ సుధీర్ కుమార్,ఏవో మణికంఠ,అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.