సెప్టెంబర్ 9లోగా కాళోజీ కళా క్షేత్రం పనులు పూర్తిచేయాలి- కుడా ఛైర్మన్.
- సెప్టెంబర్ 9న ప్రారంబించేందుకు చర్యలు
కళా క్షేత్రం నిర్మాణం పై ప్రత్యేక దృష్టి పెట్టిన
గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2014 లో శంకుస్థాపన చేసి తొమ్మిదేండ్లు గడిచినా పనులు పూర్తి చేయలేదని, కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళా క్షేత్రం నిర్మాణ పనుల పై సిఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారని, సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా కళా క్షేత్రాన్ని ప్రారంబించాలని ప్రత్యేక దృష్టి పెట్టామని, జీ ప్లస్ ఫోర్ మాడల్ లో నిర్మిస్తున్న క్షేత్రంలో ఒక్కో అంతస్తులో ఒక్కో ప్రత్యేకత ఉండేలా జరుగుతున్న సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం, ఇంటీరియర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ల్యాండ్ స్కేపింగ్, పాత్ వే, పార్కింగ్ పనులను మరియు గ్రౌండ్ ఫ్లోర్ లోని ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియం, రిహార్సల్ రూమ్స్, గ్రీన్ రూం, మొదటి అంతస్తులో ఆర్టీయం, ఫ్రీ ఫంక్షన్ వేదిక, ఆఫీస్ రూంలు, ఫుడ్ కౌంటర్, స్టోర్ రూమ్స్, వాష్ రూమ్స్, మూడు మరియు నాలుగు అంతస్తుల్లో ఫ్రీ ఫంక్షన్ హాల్స్, లాబీ, బాల్కనీ, టెర్రస్, క్యాట్ వాక్ లాబీ నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు.