కబ్జాలకు పాల్పడుతున్న వారికి కఠిన చర్యలు తప్పవు ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు
వరంగల్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ బాలాజీనగర్ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ కబ్జాకు గురియై వర్షం కురిసి నీరు ఇళ్లల్లోకి మరియు రోడ్డు మీదకి వస్తున్నాడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యి ఎమ్మెల్యే దృష్టికి రావడంతో వారు వెంటనే స్పందించి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్య లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించి అనంతరం కబ్జాలకు పాల్పడుతున్న ఎవరినైనా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదని ప్రజలకు హామీ ఇచ్చిన గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే వెంట స్థానిక డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు….