జాతీయ జెండా ఆవిష్కరించిన 56వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కొంక హరిబాబు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ రోజు 56 వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు శ్రీ కొంకా హరిబాబు అద్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకోవడం జరిగింది. ఈ సందర్బగా కొంకా హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఎంతో మంది యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించుకున్నరు.కానిగత ప్రభుత్వ హయాంలో వారి కుటుంబాలకు తగిన గుర్తింపు లభించలేదు అని అన్నారు.అట్టి కుటుంబాలను మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండ గుర్తిస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వం లో రాష్ట్రం అభివృద్ధి పథం లో దూసుకు వెళ్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ పూర్ మాజీ సర్పంచ్ శ్రీ దూలం సదానందం గౌడ్ , డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చింత రమేష్ గౌడ్ దూలం పరమేష్ గౌడ్ భూక్యా విజయ్ నాయక్ , చిలువేరు శ్యామ్ నలాబుల దామోదర్ బాలాజీ భద్రయ్య మహిళా నాయకురాలు శ్రీమతి పల్లకొండ సరోజన భాగ్యక్క , యూత్ నాయకులు బూర్ల శ్రీను, శివ ప్రసాద్, కెలపు రాజు, పల్లకోండ విజయ్ సూర్య, ఇమ్మడి సుందర్, ఇమ్మడి రాజీవ్, మేకల పవన్, భూక్యా రామకృష్ణ, భూక్యా రవి, కొలిపాక సందీప్, మోరె అనిల్, , బానోత్ ప్రవీణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..*