వరంగల్ జిల్లాకే వన్నె తెచ్చిన SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎల్లాపూర్ విద్యార్థి లావుడ్యా శ్రీ రాం నాయక్..డైరెక్టర్ గౌరిశెట్టి జగన్ మోహన్
వరంగల్ జిల్లాకే వన్నె తెచ్చిన SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎల్లాపూర్ విద్యార్థి లావుడ్యా శ్రీ రాం నాయక్ అని ఆ పాఠశాల డైరెక్టర్ గౌరిశెట్టి జగన్ మోహన్ తెలిపారు.హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎల్లపూర్ శివారులోని SPR స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థి లావుడ్యా శ్రీ రాం నాయక్ నీట్ 2024 వైద్య పరీక్షలో ఆల్ ఇండియా 2 nd ర్యాంక్ సాధించిన సందర్భంగా పాఠశాల ఆవరణలో లావుడ్యా శ్రీ రాం నాయక్ కు పూలబుకే అందజేసి ఘనంగా సత్కరించినట్లు పాఠశాల డైరెక్టర్ గౌరిశెట్టి జగన్ మోహన్ మీడియాకు తెలిపారు.ఈ సందర్భంగా గౌరిశెట్టి
జగన్ మోహన్ మాట్లాడుతూ ములుగు జిల్లా మారుమూల గ్రామం నుండి తమ spr పాఠశాలలో 7వ తరగతి ప్రవేశం పొంది పాఠశాలలోని ఉపాద్యాయులు అత్యున్నత ప్రమాణాలతో అందించే విద్యతో 10వ తరగతి పూర్తి చేసుకుని ప్రముఖ నారాయణ విద్యాసంస్థలలో ఇంటర్ మీడియట్ చదివి నీట్ 2024లో ఆల్ ఇండియా 2 nd ర్యాంక్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.అనంతరం ఆల్ ఇండియా 2 nd ర్యాంక్ సాధించిన లావుడ్యా శ్రీ రాం నాయక్ మాట్లాడుతూ మంచి డాక్టర్ కావడమే నా లక్ష్య మన్నారు.తాను మారుమూల గ్రామం నుంచి వచ్చి spr పాఠశాలలో 7వ తరగతి ప్రవేశం పొంది పాఠశాల డైరెక్టర్ గౌరిశెట్టి జగన్ మోహన్ స్వీయ పర్యవేక్షణలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్య నభ్యసించి 10వ తరగతి పూర్తి చేసుకుని ప్రముఖ నారాయణ విద్యాసంస్థలలో అధ్యాపకులు శ్రీనివాసరావు గైడెన్స్ లో,అధ్యాపకురాలు సాయిలక్ష్మీ పర్యవేక్షణలో నీట్ 2024 లో ఆల్ ఇండియా 2 nd ర్యాంక్ సాధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.