ఎస్సీ వర్గీకరణ సాధనకైఆగష్టు 12 న ఛలో ఢిల్లీ విజయవంతం చేయాలి- న్యాయవాది దర్శనం రామకృష్ణ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాదిగ హక్కుల దండోరా వాల్ పోస్టర్ల ఆవిష్కరణ చేసి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శ దర్శనం రామకృష్ణ ,మాట్లాడుతూ , కేంద్రంలో ఉన్న బిజెపి భాగస్వామ్య పాలకపక్షాల ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ ఇదిగో , అదిగో , అని మాదిగలను, దళితులను మభ్యపెడుతూ కాలయాపన చేసిందని ఆయన దుయ్యబట్టారు . 400 సీట్లు సొంతంగా సంపాదించడం కోసం కుట్రలకు తెరలేపి తెలంగాణ రాష్ట్రంలో దళితుల ప్రధాన సమస్య అయిన వర్గీకరణ మళ్లీ గుర్తొచ్చి వారి ఓట్ల కోసం కొంతమంది నాయకులతో కుమ్మక్కై 2023 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల కోసం రాష్ట్రంలో ర్యాలీలు నిర్వహించి ఎస్సీ ఏ,బి,సి,డి ( ABCD ) వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అయిన ఈ పార్లమెంట్ సమావేశాల్లో కచ్చితంగా ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి కనీసం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ 12 ఆగష్టు 2024న ఢిల్లీలో , జంతర్ మంతర్ దగ్గర వర్గీకరణ సాధనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దండోరా ధర్నా నిర్వహించడం జరుగుతుంది అని ఆయన అన్నారు. లేనియెడల 2023 సార్వత్రిక ఎన్నికల్లో మీకు ఇచ్చిన ఫలితాలు గుర్తు చేసుకుని ఇప్పటికైనా వర్గీకరణ చేపట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తొందరగా సుప్రీంకోర్టు కేసును పరిష్కరించి ఆర్టికల్ 371 (D) ద్వారా ఎస్సీ ఎ,బి,సి,డి వర్గీకరణను చేపట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం కి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు బోడ లక్ష్మణ్ తక్షణమే ఎస్సీ వర్గీకరణ కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రాష్ట్ర పాలక ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తక్షణమే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని ఈ సందర్భంగా రామకృష్ణ డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా
జిల్లా నాయకులు చాణిక్య , దర్శనం నరేంద్ర శంకర్ , వడకాల సాయిచందర్ , జినక రవీందర్ ,హెచ్. కృష్ణ, దర్శనం యుగేందర్, టీ చరణ్, పి చెర్రీ, మాలోత్ లక్ష్మి తదితరులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు .