పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్…ఏడుగురు మృతి..60 మందికి పైగా గాయాలు..
జార్ఖండ్ లోని చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా..60 మందికి పైగా గాయాల పాలైనట్లు అధికారులు తెలిపారు.
ఈ సంఘటనను ధృవీకరిస్తూ, చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆదిత్య కుమార్ చౌదరి మాట్లాడుతూ.. సంఘటన గురించి సమాచారం అందుకున్న చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్ అధికారులు, చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్ నుండి రిలీఫ్ రైలు, అన్ని అంబులెన్స్‌లను జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అంతేకాకుండా, బారాబంబో సమీపంలో రైలు నంబర్ 12810 పట్టాలు తప్పిన సంఘటన కోసం పరిపాలన హెల్ప్‌లైన్ నంబర్ 0651-27-87115 ను కూడా జారీ చేసింది.
- టాటానగర్- 06572290324
- చక్రధరపూర్- 06587 238072
- రూర్కెలా- 06612501072, 06612500244
- హౌరా- 9433357920, 03326382217
- రాంచీ- 0651-27-87115.
- HWH హెల్ప్ డెస్క్- 033-26382217, 9433357920
- SHM హెల్ప్ డెస్క్- 6295531471, 7595074427
- KGP హెల్ప్ డెస్క్- 03222-293764
- CSMT హెల్ప్‌లైన్ ఆటో నంబర్- 55993
- P&T- 022-22694040
- ముంబై- 022-22694040
- నాగ్‌పూర్- 7757912790
ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా..60 మందికి పైగా గాయాల పాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారందరికీ రైల్వే వైద్య బృందం ప్రథమ చికిత్స అందించింది. అదే సమయంలో రైల్వే ఉద్యోగులతో పాటు ఏఆర్‌ఎం, ఏడీఆర్‌ఎం, సీకేపీ బృందాలు చేరుకున్నాయి.